Mithali Raj has become the first Indian batter, and only the second overall, to score 10,000 runs in women's international cricket.
#MithaliRaj
#MithaliRaj10thousandrunsinwomencricket
#MithaliRaj10kInternationalRuns
#InternationalRuns
#womencricket
#womeninternationalcricket
#Sachin
#Viratkohli

భారత మహిళా క్రికెటర్, వన్డే టీమ్ కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. అంతర్జాతీయ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో కలిపి పదివేల పరుగుల మైలు రాయిని అందుకుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా అరుదైన గుర్తింపును అందుకుంది. అంతేకాకుండా ఓవరాల్‌గా 10 వేల పరుగులు చేసిన రెండో మహిళా క్రికెటర్‌గా నిలిచింది. ప్రస్తుతం సౌతాఫ్రికా మహిళలతో లక్నో వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ ( 50 బంతుల్లో 4 ఫోర్లతో 36) పరుగులు చేసి అన్నేబాష్ బౌలింగ్‌లో ఔటైంది. ఈ క్రమంలోనే 35 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆమె అంతర్జాతీయ క్రికెట్‌లో పదివేల పరుగుల మైలురాయిని చేరుకుంది.